జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్‌

జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవాలి అని ఎంపీ బీబీ పాటిల్ సూచించారు.