రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం నిరంతరాయంగా ముందుకు సాగుతున్నది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు నాగచైతన్య విసిరిన చాలెంజ్‌ను టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ స్వీకరించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదని.. మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమని తెలిపారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.