నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పితృవియోగం

అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణేశ్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నాలుగు రోజులుగా చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు.  ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎమ్మెల్యే గణేష్ గుప్తా స్వస్థలం మాక్లూర్‌లో కృష్ణమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీగాల కృష్ణమూర్తి ఆర్య వైశ్య సంఘంలో క్రియాశీలక పాత్ర వహించారు. నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగానూ సేవలందించారు. పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు సంతాపం ప్రకటించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి గణేశ్‌ గుప్తాను ఓదార్చారు. కృష్ణమూర్తి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.