జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ వికాస సమితి తమ సంపూర్ణ మద్దతును టీఆర్ఎస్‌కు ప్రకటించింది. తెలంగాణ వికాస సమితి హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల కమిటీలతో ఈ రోజు హైదరాబాద్ లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఒంటెద్దు నర్సింహ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో సుమారు నలభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ పోకడలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ప్రజల కనీస అవసరాల ప్రాతిపదికపై వివిధ రాజకీయ పార్టీలు తీసుకున్న వైఖరులను విశ్లేషించారు. వివిధ జాతీయ పార్టీల పని విధానాలపై ప్రతినిధులు సవివరంగా చర్చించారు. వికాస సమితి తన అవగాహన పత్రంలో పేర్కొన్నట్లుగా ప్రాంతీయ పార్టీలకు మాత్రమే మద్దతివ్వాలని దానికి కట్టుబడి ఉండాలని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.
ఈ అభివృద్ధి కొనసాగి ప్రజలు శాంతి భద్రతలతో జీవించాలంటే ప్రజలు టీఆర్ఎస్ కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నుండి డా. జయంతి, రాజు, రవీందర్, విజయానంద్, పిండిగ వెంకన్న, రూబీ స్టీవెన్, సోమిరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు రాజ మహేందర్ రెడ్డి, శ్రీనివాసాచారి, మియాపురం రమేష్ లతోపాటు సలహాదారులు సీతారామారావు, సభ్యులు ప్రొద్దుటూరి వేణుగోపాల్, లక్ష్మీ నారాయణ, ప్రవీణ్, సైదులు, వీర్రాజు, రమేష్, రమేష్ బాబు, ఉత్తమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.