తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఈ అవార్డును సతీష్ ప్రభుకు బహుకరించారు. సతీష్ ప్రభు సీబీఐ లోనూ, గతంలో ఆర్‌పీఎఫ్‌లోనూ విధులు నిర్వహించినప్పుడు అనేక సంచలన కేసులను పరిశోధించి, నిందితులకు శిక్ష పడేలా చేయడంతో కృషి చేశారు.
