సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడు సిమెంట్స్ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. చెన్నై కేంద్రంగా ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాని ముత్తయ్య ఇంట్లో ఐటీ దాడులు చేసినట్లు సమాచారం తెలిసింది. చెట్టినాడు గ్రూప్ మీద చెన్నైలో సీబీఐ కేసు నమోదు కావడంతో 100 బృందాలతో దేశ వ్యాప్తంగా చెట్టినాడు సంస్థల్లో ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి.