ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ నెల 6 న డీఎస్పీ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 13వ తేదీన బెట్టింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టగా డీఎస్పీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో డీఎస్పి లక్ష్మీనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ధ్రువీకరణ అయింది. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు.