ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ చెట్టినాడ్ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేత కేసులో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 60 కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులలో ఉన్న కార్యాలయాల్లో దాడుల చేయగా, దీంట్లో రూ.7 కోట్ల లెక్కింపబడని నగదును రికవరీ చేశారు. బుధవారం ప్రారంభమైన దాడులు గురువారం వరకు కొనసాగాయి.
సూర్యాపేట జిల్లాలో కూడా..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్స్ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. ఇప్పటికే చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమాని ముత్తయ్య ఇంట్లో ఐటీ దాడులు చేసినట్లు సమాచారం తెలిసింది.