కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ‌ ఆత్మహత్య

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్‌మగళూరు జిల్లాలోని గుణసాగర వద్ద రైలు పట్టాలపై ధర్మేగౌడ మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతదేహం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఉన్న లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. అయితే అందులో ఏముందనేది బయటపెట్టలేదు. ఈ నెల 15న సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన గొడవలో.. చైర్మన్‌ స్థానంలో ఉన్న ధర్మేగౌడను కొందరు సభ్యులు కిందికి లాగేసిన విషయం తెలిసిందే. ధర్మేగౌడకు భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీ నుంచి ధర్మేగౌడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.