ఇద్దరు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ రాష్ట్రంలో అడిషనల్‌ డీజీలుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా పోస్టింగ్‌ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు