చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఇసుక ట్రాక్టర్లతో నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ​కు చెందిన పలువురు టీఆర్ఎస్​ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్​లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం ఎమ్మెల్యే బాల్క సుమన్​ క్యాంప్ ​ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు.  ట్రాక్టర్​ ఓనర్స్ ​యూనియన్ ప్రెసిడెంట్​ నూకల శ్రీనివాస్, వైస్​ ప్రెసిడెంట్​ నామని మహేష్, కార్యదర్శి పిల్లలమర్రి అంజయ్య​ మాట్లాడుతూ మైనింగ్​డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో అక్కెపల్లి బతుకమ్మ వాగులో లోకల్​యూజ్ కోసం ఇసుక రీచ్​ఏర్పాటు చేశారని చెప్పారు. టౌన్​లో ఉన్న నలభై ట్రాక్టర్లకు ఆన్​లైన్​లో బుకింగ్​ చేసుకొని ఇసుక రవాణా చేస్తున్నామని అన్నారు. కానీ మండలానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి రూలింగ్​పార్టీ లీడర్లు, ఆఫీసర్ల అండతో సుబ్బరాంపల్లి, వెంకంపేట బతుకమ్మ వాగులో జేసీబీ పెట్టి రాత్రిళ్లు పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఆరోపించారు. చెన్నూర్​లో ప్రభుత్వ, ప్రైవేట్​ నిర్మాణాలకు దొంగచాటుగా సప్లై చేయడం వల్ల తమకు బుకింగ్స్​ తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ఆ ఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా అక్రమ రవాణా అరికట్టడం లేదని వాపోయారు. చెన్నూర్​ ఎమ్మెల్యే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ ​చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ​ఆఫీసు దగ్గర నిలిపిన ట్రాక్టర్లను పోలీసులు అక్కడినుంచి తీయించారు.