విజయవాడ హైవే పై భారీ ట్రాఫిక్ జాం అయింది. రహదారిపై దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెలకు వెళ్లిన ప్రజలు నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో రహదారులపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వాహనాల రద్దీతో హైవేపై ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. టోల్‌ప్లాజాలు దాటేప్పుడు ఈ రద్దీ ఇంకా విపరీతంగా ఉంటోంది.