సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్ చౌహాన్ అరెస్టు అయ్యాడు.. రూ. కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసు అధికారి మహేంద్రసింగ్ చౌహాన్‌ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. మహేంద్రసింగ్ 1985 బ్యాచ్ ఐఆర్‌ఐఎస్ అధికారి. ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అసోంలోని మాలెగావ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు అనుసంధానంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి అనుకూలంగా వ్యవహరించే విషయంలో లంచం డిమాండ్ చేశాడు. నిందితుడితో సంబంధం కలిగిఉన్న అసోం, ఢిల్లీ, ఉత్తరాఖండ్, సిక్కిం వంటి 20 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.