యాంకర్ ప్రత్యూష గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. యాంకర్ దేవి నాగవల్లి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రత్యూష ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మరికొందరిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. మై విలేజ్ షో అనిల్, బేబీ కృతికా, అథ్లెట్ సందీప్ నడింపల్లి, టీవీ9 దీప్తి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్న విజయవంతం చేసిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు అన్నారు. మనం ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటాం. వారంతా యాడ్స్‌లో, ఎన్నికలప్పుడు మాత్రమే వారు కనిపిస్తారు. ఇందుకు ఎంపీ సంతోష్‌కుమార్ భిన్నం అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంతో ఎల్లప్పుడూ బీజీగా ఉంటారన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందరూ పాల్గొనాల్సిందిగా ఆమె కోరారు.