ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభయ్యాయి. ఇందులో భాగంగా తొలి దశ పంచాయతి ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. నామినేషన్ల దాఖలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈనెల 31 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 4 వరకు నామపత్రాలను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉన్నది. వచ్చే నెల 9న తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. మిజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి.