అదనపు డీజీ హోదాలో సోమవారం సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సజ్జనార్ గౌరవ వందనాన్ని అం దుకున్నారు. ఐజీ హోదాలో రెండున్నర ఏండ్ల కింద పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌కు ఇటీవల అదనపు డీజీగా పదోన్నతిని కల్పించి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో అదనపు డీజీ హోదాలో సీపీ సజ్జనార్ సోమవారం నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శంషాబాద్, మాదాపూర్, బాలానగర్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పద్మజ, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, షీ టీమ్స్ డీసీపీ అనసూయ, ఎస్‌ఓటీ సందీప్, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ అదనపు డీసీపీ మాణిక్‌రాజు, ఉన్నతాధికారులు సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.