ఏప్రిల్‌ 9న రాజకీయ పార్టీ ప్రకటన: వైఎస్‌ షర్మిల

లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్‌ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు, విధి విధానాల విషయంలో పార్టీ నేతలకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చా రు. టీఆర్‌ఎస్‌కో, బీజేపీకో ‘బీ’టీమ్‌గా ఉండాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. సమస్యల సాధనకు మాత్రమే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఖమ్మం వేదికగానే పార్టీ సమర శంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 9న లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు వైఎస్‌ఆర్‌ అభిమానులు షర్మిలను కోరారు.