తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 3,052 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,581కి చేరింది. మహమ్మారి బారినపడి నిన్న ఏడుగురు మృతి చెందగా..ఇప్పటి వరకు 1,772 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 778 మంది డిశ్చార్జై ఇండ్లకు వెళ్లగా.. మొత్తం 3,06,678 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్‌ కేసులుండగా.. 16,118 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒకే రోజు 1,13,007 టెస్టులు చేయగా.. 3,052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 92.21 శాతం ఉందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 406 కేసులున్నాయి.