జగిత్యాల జిల్లా కోరుట్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర్‌, కొప్పులు ఈశ్వర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనంలో కేటీఆర్‌ మొక్కను నాటారు. ఖాదీ మైదానంలో రూ.6.5కోట్లతో చేపట్టనున్న అధునాతన మార్కెట్‌ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విద్యా సాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జెడ్పీ ఛైర్మన్‌ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.