ఏపీలో కొత్త‌గా 4,872 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గు ముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4,872 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 86 మంది చ‌నిపోయారు. గ‌త 24 గంట‌ల్లో 13 వేల 702 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 1,14,510 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క‌రోజే 64 వేల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. క‌రోనాతో చిత్తూరు జిల్లాలో 13 మంది, గుంటూరు జిల్లాలో 10, శ్రీకాకుళంలో 9, విజ‌య‌న‌గ‌రం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మ‌ర‌ణించారు.