మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్‌ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.