ఏసీబీకి చిక్కిన జ‌గిత్యాల ప‌ట్ట‌ణ ఎస్ఐ శివ‌కృష్ణ

జ‌గిత్యాల ప‌ట్ట‌ణ ఎస్ఐ శివ‌కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. స్టేష‌న్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ శివ‌కృష్ణ లంచం డిమాండ్ చేశాడు. బాధిత వ్య‌క్తి నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు.. శివకృష్ణ‌ను అదుపులోకి తీసుకున్నారు. శివ‌కృష్ణ‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.