గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్

రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ త‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నేరెడ్‌మెట్‌లోని త‌న కార్యాల‌యంలో సీపీ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. వ‌చ్చే రెండు నెల‌ల్లో మేడిప‌ల్లి, యాదాద్రిలో 20 వేల మొక్క‌లు నాటుతామ‌ని చెప్పారు. రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం అద్భుత‌మ‌ని సీపీ కొనియాడారు.