హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి

 ఏడో విడుత హరితహారాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ఈ సారి మొక్కలను ప్రణాళికా బద్ధంగా నాటాలన్నారు. జిల్లాలో పల్లె నుంచి పట్టణాల వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటలన్నారు. జూలైలో ప్రారంభం కానున్న హరితహారానికి అంతా సిద్ధం కావాలన్నారు.

భైంసా నుంచి బాసర హైవే రోడ్డుకు ఇరువైపులా, నిర్మల్ నుంచి భైంసా హైవే ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఆయా శాఖల అధికారులకు ఇచ్చిన టార్గెట్‌ ను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బొర్కడె, పి.రాంబాబు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.