తెలంగాణ‌లో కొత్త‌గా 1088 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 1,088 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొవిడ్‌-19తో తాజాగా 9 మంది చ‌నిపోయారు. 1,511 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల‌తో క‌లుపుకుని రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 6,17,776కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,030గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,607 మంది చ‌నిపోయారు.