ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
పరీక్షల నిర్వహణ, ఫలితాలకు 45 రోజుల సమయం పడుతుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. హైపవర్ కమిటీ నివేదిక తర్వాతే మార్కులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు సూచన మేరకే పరీక్షల రద్దు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.