ఏపీలో కొత్తగా 4,458 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,458 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 6313 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 18,71,475కు పెరిగాయి. ఇవాళ్టి వరకు 18,11,157 మంది కోలుకున్నారు. ఇంకా 47790 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 12,528కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 91,849 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.