అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై వేటుపడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయకపోవటం, పారిశుధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు రెండు గ్రామాల సర్పంచ్ లు, ఓ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ హరిత సస్పెన్షన్ వేటు వేశారు. నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సుబ్బారావు, గీసుకొండ మండలం ఊకల్ గ్రామ సర్పంచ్ నాగదేవతను సస్పెన్షన్ చేస్తూ ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు ఊకల్ గ్రామపంచాయతీ కార్యదర్శి సునితను కూడా జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేసినట‌్లు జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ వెల్లడించారు.