ఎస్వీబీసీ ఛాన‌ల్‌కు రూ.2 కోట్ల విరాళం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఆధ్వ‌ర్యంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం రోజున ఆ ఛాన‌ల్‌కు భారీ విరాళం అందింది. ఒకే రోజు విరాళం రూపంలో ఆ ఛాన‌ల్ రెండు కోట్లు అందుకున్న‌ది. ఒక్క రోజు ఇంత మొత్తం విరాళం రావ‌డం ఇదే మొద‌టిసారి. ఇండియ‌న్ మిన‌ర‌ల్స్ అండ్ గ్రానైట్ కంపెనీ ప్ర‌తినిధులు కోటి రూపాయ‌ల డీడీని టీటీడికి అంద‌జేశారు. ప‌ట్టాభి ఆగ్రో ఫుడ్ ప్రైవేటు సంస్థ కూడా కోటి డోనేట్ చేయడం గ‌మ‌నార్హం.