డాక్ట‌ర్ ఎల్లూరి శివారెడ్డికి దాశ‌ర‌థి అవార్డు ప్ర‌దానం

తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్ర‌దానం చేశారు. ర‌వీంద్ర భార‌తిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ అవార్డు కింద సైటేషన్‌తో పాటు రూ.1,01,116 నగదును ఎల్లూరి శివారెడ్డికి అంద‌జేశారు. మహాకవి దాశరథి సేవలను చిరస్మరణీయం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యరంగంలో విశేషంగా కృషిచేసిన వారికి ప్రతిఏటా దాశరథి జయంతి అయిన జూలై 22న అవార్డు ఇస్తున్నది.