ఏసీబీ వలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్ సునీతను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ కొత్తపల్లి శివారులోని సర్వే నెంబరు 3 లో భూమికి ఆన్‌లైన్‌ చేసి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని కోరాడు. అందుకు కోసం తహసీల్దార్‌ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు గురువారం రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.