తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్ రావు నేతృత్వంలో వర్చువల్ విధానంలో జ‌రిగిన ఈ భేటీకి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మండలి న్యాయవాదులు హాజ‌ర‌య్యారు. ప్రాథ‌మిక సమావేశంలో పలు అంశాలను చర్చించారు. కాలుష్య నియంత్రణ మండలిచే అమలు చేస్తున్న చట్టాలు, నిబంధనలు వాటి అమలు విధానం గురించి అప్పిలేట్ అథారిటీ చైర్మన్ కు అధికారులు వివరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు ఈ విధంగా ఉన్నాయి.

  • అప్పిలేట్ అథారిటీ కార్యాలయాన్ని ఉదయం 10.30 గంట‌ల నుండి సాయంత్రం 5.00 వరకు ( శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేసేంత వరకు) తాత్కాలికంగా కాలుష్య నియంత్రణ మండలి జోనల్ కార్యాలయము బేగంపేట, హైదరాబాద్ లో నిర్వహిస్తారు.
  • అథారిటీకి సంబంధించిన అప్పీల్స్‌ను, దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ నుంచి పై కార్యాలయంలో స్వీకరించ‌నున్నారు.
  • ఈ నెల 17వ తేదీ నుండి విచారణను వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తారు
  • సమాచారం కొరకు e-mail: [email protected], ఫోన్ నంబ‌ర్ : 040-23402495 ని సంప్రదించాల్సిందిగా సూచించారు.