మట్టి విగ్రహాలను పూజిద్దాం.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం..

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో మట్టి వినాయక విగ్రహాలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం గణేష్ విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. అంతకుముందు వినాయకున్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.