జనగామ కలెక్టర్‌ వాహనంపై రూ.22 వేల చలాన్లు

జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనం (టీఎస్‌ 27ఏ 0001) పై యూజర్‌ చార్జీలు కలుపుకుని చలాన్ల కింద రూ.22,905 జరిమానా విధించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా కలెక్టర్‌ వాహనం 23 సార్లు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లినందుకుగాను సంబంధిత పోలీసులు ఈ జరిమానా విధించారు. ఈ చలాన్లు ఏడాదికాలంగా నమోదయ్యాయి.