మంత్రి తుమ్మలని మర్యాద పూర్వకంగా కలసిన పసుపు బోర్డ్ సెక్రెటరీ శ్రీమతి ఎన్. భవానీ శ్రీ.

ఈ రోజు సెక్రెటరీయట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని మర్యాద పూర్వకంగా కలసిన పసుపు బోర్డ్ సెక్రెటరీ శ్రీమతి ఎన్. భవానీ శ్రీ. ఈ సందర్భముగా కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన కార్యక్రమం వివరాలను మంత్రి తుమ్మలకి వివరించిన బోర్డు సెక్రెటరీ. ఆయిల్ పామ్ లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించిన మంత్రి తుమ్మల. ప్రస్తుతం సాగులో ఉన్న రకాలను బదులుగా అధికంగా కుర్క్ మిన్ ఉన్న రకాలను సాగు చేయించె విధంగా ప్రోత్సహించాలని కోరిన మంత్రి తుమ్మల. పసుపు ఉత్పాదకాల మార్కెటింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా సూచించారు. కోత అనంతరం ఉపయోగపడే పసుపు ఉడకబెట్టే యంత్రాలు , పాలిషర్స్ , గ్రైండర్లు లాంటి వాటిని రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలపిన సెక్రెటరీ. పసుపు రైతు ఉత్పత్తి సంఘాలను గుర్తించి వారికి 23 లక్షల వరకు రాయితీ కల్పించి, కోత అనంతరం పసుపులో అవసరమయ్యే పనిముట్లను ,యంత్రాలను అందిస్తున్నట్లు తెలియచేసిన సెక్రెటరీ. రైతులకు IPM, పద్దతుల్లో , Organic Certification లో తోడ్పడుతున్నట్లు తెలపారు. ప్రస్తుతం పసుపును powder రూపంలో ITC , పతాంజలి వంటి వివిద కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడి. • తూర్పు , మద్యమ దేశాలకు సరఫరా చేసే ఒక ప్రముఖ కంపెనీ 10 ఎకరాల స్థలంలో ప్రాసెసింగ్ యూనిట్ కూడా నిజామాబాద్ లో స్థాపించడానికి ముందుకు వచ్చిందని మంత్రికి తెలియ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కుర్క్ మిన్ పసుపులో అధికంగా వచ్చే నూతన రకాల సాగు, పురుగు,కలుపు రకాల వినియోగం తగ్గించడం ద్వారా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, ఆయిల్ పామ్ లో అంతర పంటగా పసుపు సాగు చేసే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా సూచించారు. పసుపు ఉత్పత్తులకు ఫార్మా మరియు ఆయుర్వేద రంగంలో ఉన్న అవసరాల దృష్ట్యా బోర్డు ద్వారా మార్కెటింగ్ లింకేజీలు కల్పించాలని కోరారు. ఆదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేశారు.