సింగరేణి సీఎండీగా దేవరకొండ కృష్ణభాస్కర్‌

 సింగరేణి చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా దేవరకొండ కృష్ణభాస్కర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్లుగా సింగరే ణిలో, రెండేళ్లుగా ఆ సంస్థకు సీఎండీగా పనిచేస్తున్న ఎన్‌.బలరామ్‌ డిప్యుటేషన్‌ కాలం పూర్తవడంతో ఆయన్ను మాతృ శాఖకు రిలీవ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి వద్ద ప్రత్యేక కార్యదర్శిగా, ట్రాన్స్‌కో సీఎండీగా పనిచేస్తున్న కృష్ణభాస్కర్‌కు సింగరేణి సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం బలరామ్‌ నుంచి కృష్ణ భాస్కర్‌ బాధ్యతలు స్వీకరించారు. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కృష్ణ భాస్కర్‌ గతంలో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా, రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ స్పెషల్‌ సెక్రటరీగానూ వ్యవహరించారు.