గ్రీన్ ఎనర్జీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలన్న ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ ఉపయోగ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో భాగంగా 38,216 గ్రామాలు మరియు 16,078 వ్యవసాయ పంప్ సెట్ లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. గృహ ఉపయోగ రూఫ్ టాప్ సోలార్ కింద పీఎం సూర్యగర్ ప్రభుత్వ బిజిలీ కింద 40, 349 గృహాల్లో టు కే సామర్థ్యం రూట్ ఆఫ్ సోలార్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ సేవలు కింద పీఎం kusum కాంపోనెంట్ సి కింద 7.5 kw హై rize సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా 16,708 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.