నిమ్స్ లో చికిత్స పొందుతున్న గద్దర్ భార్య విమలను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల నిమ్స్ లో గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం నిమ్స్ లో చేరిన విమల గారికి నేడు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ లు కొద్దిసేపటి క్రితం నిమ్స్ లో డైరెక్టర్ బీరప్పను కలిసి విమల కు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. విమల వెంట కుమారుడు సూర్యం కుటుంబ సభ్యులు ఉన్నారు.