సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లక్ష్మీ దేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సమయంలో ఒక్క సారిగా మంటలు ఎగసిపడటంతో దట్టమైనా పోగ కమ్ముకుంది. ప్రమాదవశాత్తు ఒక్క సారిగా ఫ్యాక్టరీలో రియాక్టర్ ఫిల్టర్ బట్టీ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంబడే ఫ్యాక్టరీ పరిసరాలలో దట్టమైనా పోగ కమ్ముకుంది. దీంతో పరిసరాల ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడుతో కంపేనీలో పనిచేస్తున్న పలుపురు కార్మికులు తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. మీడియాను కంపెనీ యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వకపోవడంతో లారీ టైర్ పేలిందని అబద్దం చెప్పారు. ఈ విషయం పరిగి తహాశీల్దార్ వెంకటేశ్వరి, ఎస్ఐ 2 నాగేందర్, ఫైర్ స్టేషన్ అధికారులు సంఘటన స్థాలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పూర్తి విచారణను తహాశీల్దార్ తో పాటు సిబ్బంది చేపట్టారు. అయితే అధికారులను కూడా కంపేనీ లోపలికి అను మతించలేదు. తద్వార వాహానాలను బయట ఉంచి కాలి నడకన అధికారులు లోపలికి వెళ్లారు. 108 అంబులెన్స్ ను కూడా లోపలికి ప్రవేశించలేదు. ఏడాదిలో ఈ స్టీల్ కంపేనీలో మూడు నాలుగు సార్లు పెలుళ్లు జరుతున్నా యి. బీహీర్ నుంచి వలస వచ్చిన కార్మికులు కాంట్రాక్టర్ సమాయంతో ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. కార్మికులు ప్రతి పెలుళ్ల సంఘటనలో ఇద్దరూ ముగ్గురు కార్మికులు మృతి చెందుతున్నారు. మృతుల కుటుంబాలకు నామ మాత్రం పారితోషికం ఇచ్చి, అధికారులకు మామూళ్లు ఇచ్చి (లంచాలు) చేతులు దులుపుకుంటున్నారని పులు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే కంపెనీని సీజ్ చేసి ఇక్కడి నుంచి దూరంగా తరలించాలని పలువురు కోరుతున్నారు.