రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.