రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తి చాటి చెప్పడానికే శాసనసభ్యుల క్రీడా పోటీలు

  • మొదటి ఎడిషన్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్ 2026

రాష్ట్రంలో విద్యార్థులు యువకులు అన్ని వర్గాలకు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా
శాసన సభ్యుల క్రీడోత్సవాలు నిర్వహించబోతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి లు తెలిపారు. ఈనెల 28 29 తేదీల్లో జరగబోయే శాసనసభ్యులు శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు మొదటి ఎడిషన్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్ 2026 నిర్వహణ సన్నాహక సమావేశం ఈరోజు అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనునిత్యం రాజకీయాల్లో బిజీ ఉండే శాసన సభ్యులు శాసనమండలి సభ్యులకు ఈ క్రీడా పోటీలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని క్రీడల పట్ల అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పోటీలు మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్నామని, పార్టీలబేధ భావాలు పక్కనపెట్టి శాసనసభ్యులు అందరూ ఈ క్రీడల్లో పాల్గొన్న పోతున్నారని వారు తెలిపారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి వయసుల వారికి క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఇందుకోసం శాసనసభ సచివాలయము తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మరియు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తోపాటు వివిధ శాఖల సమన్వయంతో శాసనసభ్యులకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో శాసనమండలి విప్ అద్దంకి దయాకర్ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ యశస్విని రెడ్డి , పాల్వాయి హరీష్ రావు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ రావు భాను ప్రసాద్ రావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి శాసనమండలి కార్యదర్శి నరసింహచార్యులు శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి వివిధ క్రీడా వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

28న ప్రారంభం: మొదటి ఎడిషన్ లెజిస్టేటర్ స్పోర్ట్స్ మీట్ 2026 ప్రారంభ వేడుకలు ఎల్బీ స్టేడియంలో 28వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతాయని
సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తోపాటు ఉభయ సభల వివిధ పక్ష నేతలు విప్ లు అన్ని పార్టీల శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.