భారతీయ సైన్యంలో చేరేందుకు దరఖాస్తుకు ఏప్రిల్ 10 వతేదీ వరకు అవకాశం

హైదరాబాద్ : భారతీయ సైన్యం రిక్రూట్‌మెంట్ ఇయర్ 2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 1 ఏప్రిల్ 2026 వరకు ఉండగా, ఇప్పుడు ఆశావాదులైన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించడానికి దరకాస్తు గడువును ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగిస్తూ ప్రకటన వెలువడి. నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేని అర్హులైన యువతీ యువకులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసి పాల్గొనేలా చేయడానికి ఈ అవకాశం కల్పించారు. సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగే అభ్యర్థులు ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నూతన గడువు ముగిసేలోపు తమ దరఖాస్తు ప్రక్రియను www.joinindianarmy.nic.in ద్వారా పూర్తి చేయాలని ప్రకటనలో తెలిపారు. .
అభ్యర్థులు తమ అర్హత (వయసు, విద్యార్హత, శారీరక ప్రమాణాలు) గురించి అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలని సూచించారు. భారతీయ సైన్యం దేశ యువతకు సాయుధ దళాల్లో సేవ చేసే సమాన అవకాశాలు కల్పించడానికి పూర్తిగా ఆటోమేటెడ్, న్యాయమైన మరియు పారదర్శక పద్ధతిని పాటిస్తారు. ఈ నియామకాల్లో ఏవిధమైన సిఫార్సులకు తావులేదని, మోసపూరిత ఏజెంట్ల నుంచి అభ్యర్థులు తీవ్రంగా జాగ్రత్త వహించాలని, ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తికి ఎలాంటి పాత్ర లేదని ఆ నియామక ప్రకటనలో స్పష్టం చేశారు.