పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా వాణి ప్రసాద్

పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు స్వీకరించిన పి. గౌతమి శుక్రవారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు.. వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు