నకిలీ పాస్‌పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ఔట్‌పోస్టు పోలీస్ స్టేషన్ సీఐ సంపతి కనకయ్య, ఎస్సై శ్రీధర్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమా ర్ తెలిపిన వివరాల ప్రకారం… ఓ కేరళ వాసి నకిలీ పాస్‌పోర్టుపై కొన్ని రోజుల క్రితం ఔట్‌పోస్టు పీఎ్‌సలో కేసు నమోదైంది. సీఐ, ఎస్‌ఐలు రూ.15 లక్షలు ఇవ్వాలని నిందితుడిని డిమాండ్ చేశారు. లేదంటే మీ ఇంట్లో వాళ్ల పేరు చార్జిషీట్‌లో చేర్చుతామని బెదిరించారు. దీంతో నిందితుడు రూ.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా రూ.2 లక్షలు ఇస్తానని చెప్పి.. మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఔట్‌పోస్టు పీఎస్ లో సీఐ, ఎస్సైలు అతని నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ డీఏ స్పీ ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.