సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియంను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియం ను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కుతుబ్ షాహీ టూంబ్స్ లోని ఇంటర్ప్రిటేషన్ సెంటర్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసు పెండింగ్ గురించి చర్చించారు. కేసు పూర్వాపరాలను గురించి వివరించారు. ట్రిబ్యునల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను మినహాయించి, మిగిలిన పనులను వారంలోగా ప్రారంభించి, వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోప్ వే: కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్ వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయని ఆరా తీశారు. క్లియరెన్స్ స్టేజిలో ఉన్నాయని, ఆయా శాఖల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్ సిద్ధం చేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం కటోరా హౌస్ ను సందర్శించారు.
పురావస్తు శాఖ, GHMC, HMDA, కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ ఆటోఆరిటీని సమన్వయం చేసుకుని , డీపీఆర్ ను సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కటోరా హౌస్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కటోరా హోసే పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యర్థాలను వెనువెంటనే తొలగించాలని GHMC అధికారులు ఆదేశించారు. తర్వాత గోల్కొండ కోట సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాన్నారు. ఈ ప్రతిపాదనలను నేషనల్ మోనుమెంట్ మిషన్ అథారిటీకి పంపి అనుమతులు పొందాలని సూచించారు.

అక్కడి నుంచి ఖజానా బిల్డింగ్ మ్యూజియంకు చేరుకున్నారు. ఎంతో చారిత్రాత్మక విలువైన కళాఖండాలు ఉన్న ఈ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రదేశంలో చేనేత వస్త్రాల ( ఖాదీ) ప్రదర్శన ను ఏర్పాటు చేయాలని పురావస్తు , టీజీటీడీసీ, QQSDA అధికారులను ఆదేశించారు. కేబీ మ్యూజియం వెనక భాగంలో ఉన్న ఆక్రమణలను పోలీస్ శాఖ సహకారంతో వారం రోజుల్లో తొలగించాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, ఇతర శాలల అధికారులు పాల్గొన్నారు.