బీజేపీ రాజకీయ స్వార్థం వల్లే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయింది: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీజేపీ రాజకీయ స్వార్థం వల్లే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముడిపెట్టి మహిళలను బీజేపీ మోసం చేసింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి, డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని చూసింది అన్నారు. ఇప్పటికైనా బీజేపీ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ బిల్లు లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ కోసమే కొత్త బిల్లును తీసుకురావాలి అన్నారు. జమ్మూ కాశ్మీర్, అస్సాం రాష్ట్రాలలో దేశవ్యాప్త డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా అసెంబ్లీ సీట్లు పెంచి, తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది?. ఈరోజు జరిగిన పరిణామాలతో బీజేపీ గుణపాఠం నేర్చుకుని, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ బిల్లుపై విస్తృత చర్చలు చేయాలి అన్నారు.