నల్లగొండ ఇరిగేష‌న్ ఈఈ స‌తీశ్ చంద్ర అనుమానాస్ప‌ద మృతి

నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్‌ చంద్ర అనుమానాస్ప‌ద‌రీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో ప‌డి ఆయ‌న మృతిచెందారు. సతీశ్‌ చంద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియ‌రాలేదు. కాల్వ‌లో జారిపడ్డాడా లేక‌ పని ఒత్తిడి, లేక వ్యక్తిగత కారణాల‌తో కాల్వ‌లో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడూ విధుల్లో చురుగ్గా ఉంటూ జిల్లా సాగునీటి సరఫరాను పర్యవేక్షించే అధికారి ఇలా ప్రాణాలు కోల్పోవ‌డం తోటి ఉద్యోగులను కలిచివేసింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం కోసం న‌ల్ల‌గొండ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.