తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను అందజేసిన నోరి దత్తాత్రేయుడిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిసి క్యాన్స‌ర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణను అంద‌జేసిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య‌నిపుణులు నోరి దత్రాత్రేయ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్థూ.

తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను అందజేసిన నోరి దత్తాత్రేయుడిని అభినందించిన ముఖ్య‌మంత్రి. క్యాన్సర్‌పై పోరాటంలో నోరి దత్తాత్రేయుడు రూపొందించిన అట్లాస్ ఎంతో ఉపయోగకరమన్న‌ సీఎం రేవంత్ రెడ్డి. క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను అన్వేషించే అవకాశం ఈ నివేదిక ద్వారా లభిస్తుందన్న‌ సీఎం. నివేదికలో అందించిన డేటా ఆధారంగా క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న ముఖ్య‌మంత్రి. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, క్యాన్సర్ బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామ‌న్న సీఎం. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సను మరింత సమర్థవంతంగా అందించాల‌ని సూచ‌న‌.