హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు మళ్లింపు

ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్యంగా తెలియజేయునది, ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉప్పల్ GHMC కార్యాలయం పక్కన ఉన్న వరంగల్, హనుమకొండ మరియు యాదగిరిగుట్ట బస్సుల స్టాప్‌ను తాత్కాలికంగా నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చడం జరిగింది. కావున వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట వైపు ప్రయాణించవలసిన ప్రయాణికులందరూ నల్ల చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వరంగల్ బస్ స్టాప్ అందుబాటులో ఉన్న బస్సుల ద్వారా తమ తమ గమ్యస్థానాలకు వెళ్లవలసిందిగా మనవి.

అదేవిధంగా, రేపటి నుండి అనగా తేదీ 17-05-2026 ఆదివారం ఉదయం నుండి ఉప్పల్ రింగ్ రోడ్ లోని వరంగల్ వైపు వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది. ఈ కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉండే అవకాశమున్నందున, వాహనదారులు మరియు ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ప్రయాణించవలసిందిగా సూచించడమైనది. వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు – మే ఫీల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ ద్వారా నాగోల్ వెళ్లి, సర్వీస్ రోడ్డు ద్వారా వెళ్లి ఫ్లైఓవర్ కింద యూ టర్న్ తీసుకొని హైదరాబాద్ వెళ్లాలి. హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు- సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డ మీదుగా వెళ్లి NH 163 మీదుగా వరంగల్లు వెళ్లాలి. ఉప్పల్ బకాయత్ రోడ్డు చాలా చిన్నది కనుక హైదరాబాదు వచ్చే వరంగల్ బస్సులు మరియు లారీలు పెద్ద వాహనాలన్నీ కూడా ఓఆర్ఆర్ మీదుగా హయత్ నగర్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. అలాగే హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు ఎల్బీనగర్, హయత్నగర్ ORR మీదుగా ఘట్కేసర్ నుండి వరంగల్ వెళ్ళగలరు. ప్రజల సౌకర్యార్థం మరియు ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా పోలీసు శాఖ మరియు సంబంధిత అధికారుల సూచనలను పాటించి సహకరించగలరు.