“నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” ప్రదానం కార్యక్రమం

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో శనివారం “నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. CETI ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ మీడియా అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఉర్దూ భాష, సాహిత్యం మరియు జర్నలిజం అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు స్వర్గీయ నసీమ్ ఆరిఫీ సేవలను స్మరించుకుంటూ ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి, సీనియర్ దౌత్యవేత్త డాక్టర్ ఆసఫ్ సయీద్ హాజరై ప్రసంగించారు. ఉర్దూ మీడియా సమాజంలో నసీమ్ ఆరిఫీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. యువ జర్నలిస్టులు నిబద్ధతతో, సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్బంగా నసీమ్ ఆరిఫీ పై అకాడమీ ముద్రించిన చిరు పుస్తకాన్ని మొనొగ్రఫ్ ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా అకాడమీ ఏర్పాటు గూర్చి వివరిస్తూ 1996 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో అకాడమీ స్థాపించినప్పుడు తొలి చైర్మన్ గా భాద్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టుల జీవిత చరిత్రలు, అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు 12 మోనోగ్రాఫ్‌లను విడుదల చేసినట్లు తెలిపారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో పుస్తకాలు చదివేందుకు సమయం దొరకని పరిస్థితుల్లో, ఈ మోనోగ్రాఫ్‌లు జర్నలిజం రంగ రంగంలో లబ్ధ ప్రతిష్టుల గురుంచి తెలుసుకునే అవకాశం కల్పించాంమని తెలిపారు. కార్యక్రమాన్ని CETI ఫౌండేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ బషారత్ అలీ నిర్వహించారు. అవార్డుల ప్రాముఖ్యతపై మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం డీన్ మరియు హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ఎబ్తేశామ్ అహ్మద్ ఖాన్ ప్రత్యేకంగా ప్రసంగించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లా ఖాన్ కూడా కార్యక్రమంలో పాల్గొని ఉర్దూ మీడియా అభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన ప్రముఖ ఢిల్లీ వాస్తవ్యలు మాసూమా మురాదాబాద్ కి జీవిత సాఫల్య పురస్కారం మరియు యామీన్అన్సారీ, హైదరాబాద్ వాస్తవ్యలు మహమ్మద్ అలీమొహియుద్దీన్ మరియు ఎం.డ్. ఫజల్ బైగ్ మరియు రోహిణి సింగ్ కు నసీమ్ అరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్-2025 ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ జర్నలిస్టు మాజిద్, పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు, సాహితీవేత్తలు మరియు ఉర్దూ భాషాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.